Back to latest news

latest news

ఇంజినీర్ల డే, జాతీయ కాంక్రీట్ డే సందర్భంగా శుభాకాంక్షలు

14 September 2026

ఇంజినీర్ల డే, జాతీయ కాంక్రీట్ డే సందర్భంగా శుభాకాంక్షలు

రాజమహేంద్రవరం:: ఇంజినీర్ల డే, జాతీయ కాంక్రీట్ డే: సందర్భంగా ఇంజినీరింగ్‌ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ చార్టర్డ్ ఇంజినీర్, స్ట్రక్చరల్ ఇంజినీర్ Er.. కె. రామచంద్రరెడ్డి:హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన కాంక్రీట్‌ సాంకేతికత, పటిష్టమైన నిర్మాణ ప్రమాణాలతో సుస్థిరమైన, బలమైన, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మౌలిక వసతుల నిర్మాణానికి ఇంజినీరింగ్‌ రంగం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

దేశ నిర్మాణానికి విశేష సేవలందించిన భారతరత్న సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి ఇంజినీర్‌కు గర్వకారణమని తెలిపారు.

Er.. కె. రామచంద్రరెడ్డి,: WALT P ఆంధ్రప్రదేశ్ స్టేట్ E.C. మెంబర్‌గా, ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ (ICI) రాజమహేంద్రవరం సెంటర్ కార్యదర్శిగా, ACCE (India) రాజమహేంద్రవరం సెంటర్ కార్యదర్శిగా ఇంజినీరింగ్‌ రంగంలో సేవలందిస్తున్నారు.

“సురక్షిత నిర్మాణం – నాణ్యమైన కాంక్రీట్ – సుస్థిర భారతదేశం” అనే లక్ష్యంతో ఇంజినీర్లంతా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇంజినీర్ల డే, జాతీయ కాంక్రీట్ డే సందర్భంగా శుభాకాంక్షలు | సప్తచక్ర పబ్లిక్ వాయిస్