Back to latest news

latest news

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని!ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

12 September 2026

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని!ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రియల్‌ ఎస్టేట్‌ గొప్పలు చెప్పుకునేవారికి తాతను నేనే: సీఎం రేవంత్‌ రెడ్డి:

హైదరాబాద్‌:: “నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేవాడిని. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌లో గొప్పలు చెప్పుకుంటున్న వారికి తాతను నేనే” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. తనకు పదవులపై, డబ్బుపై కక్కుర్తి లేదని అన్నారు.

“దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వరకు పదవులు ఇచ్చాడు:. ఇంకెందుకు కక్కుర్తి పడాలి?” అని ప్రశ్నించారు. తనకు పైశాచిక కోరికలు లేవని, అందుకే పడుకున్న వెంటనే రెండు నిమిషాల్లో నిద్రపోతానని వ్యాఖ్యానించారు.

పేద కుటుంబం నుంచి రాజకీయ శిఖరాలకు:

తాను నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నానని సీఎం తెలిపారు. తనపై కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ముఖ్యంగా తన ఇంగ్లిష్‌పై అసూయపడుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

“జెన్‌ జీ కాదు.. జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా గురించి ఆలోచిస్తున్నా”:

రాష్ట్ర భవిష్యత్‌ తరాలపై తన దృష్టి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. “అందరూ జెన్‌ జీ గురించి ఆలోచిస్తున్నారు.. నేను జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా గురించి ఆలోచిస్తున్నా” అని చెప్పారు.

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్‌ నిర్మాణం జరుగుతుందని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ::, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, తెలంగాణలో ప్రస్తుతం సగటున 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని సీఎం సభలో పేర్కొన్నారు.

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని!ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి | సప్తచక్ర పబ్లిక్ వాయిస్