Back to latest news

latest news

విశాఖ కేంద్రంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు?

10 September 2026

విశాఖ కేంద్రంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు?

రియల్ ఎస్టేట్ ముసుగులో భారీ పెట్టుబడి నెట్‌వర్క్? రిటర్నులు నిలిపివేసి కార్యాలయాల మూసివేత ఆరోపణలు

విశాఖపట్నం: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో My Land Infra Developers భారీ స్థాయిలో ప్రజల నుంచి పెట్టుబడులు సమీకరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ప్యాకేజీలు, అధిక రాబడుల హామీలు, ఏజెంట్లకు భారీ కమిషన్లు, బహుళస్థాయి MLM నెట్‌వర్క్ ద్వారా నిధులు సమీకరించినట్లు సమాచారం.

రూ.200 కోట్లకు పైగా వసూళ్లు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెట్టుబడులు స్వీకరించిన అనంతరం కొన్ని ప్రాంతాల్లో రిటర్నుల చెల్లింపులు నిలిచిపోయాయని, కార్యాలయాలు మూసివేసినట్లు పెట్టుబడిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం.అసలు ప్రశ్నలు ఇక్కడే మొదలవుతున్నాయి. ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించేందుకు సంస్థకు ఏ చట్టబద్ధ అనుమతులు ఉన్నాయి? పెట్టుబడులకు హామీ ఇచ్చిన రాబడులకు ఆధారం ఏమిటి? సేకరించిన వందల కోట్ల నిధులు ఎక్కడికి మళ్లాయి? చెల్లింపులు ఎందుకు నిలిచిపోయాయి?సంస్థకు సంబంధించిన MCA, GST, రియల్ ఎస్టేట్ అనుమతులు, పెట్టుబడి పథకాల చట్టబద్ధత, ఏజెంట్ కమిషన్లు, బ్యాంకు లావాదేవీలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

రూ.200 కోట్ల వసూళ్ల ఆరోపణలు నిజమేనా? ప్రజల డబ్బుకు బాధ్యత ఎవరిది? రిటర్నులు ఎప్పుడు?ఈ ప్రశ్నలకు సంస్థ స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో పాటు, పోలీసులు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.

విశాఖ కేంద్రంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు? | సప్తచక్ర పబ్లిక్ వాయిస్